గాలివానలు, ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి
రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, నవంబర్ 3 (నవోదయం):
మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రస్తుతం కురుస్తున్న ఆకస్మిక వర్షాలు, ఈదురుగాలులతో పాటు రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావం కారణంగా తలెత్తే వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ఆదేశించారు.
మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకస్మిక వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పంటలకు జరుగుతున్న నష్టాన్ని ఎప్పటికప్పుడు గుర్తించాలని, పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు సూచించారు. బాధిత రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.
అలాగే రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, వ్యవసాయ రంగానికి ఎదురయ్యే సవాళ్లపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
గాలివానల సమయంలో విద్యుత్ అంతరాయాలు, ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లను వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు, ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
రైతుల సంక్షేమం, ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యతని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజలకు అండగా నిలవాలని బీఎల్ఆర్ సూచించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Telangana
గాలివానలు, ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
Quick Summary:
గాలివానలు, ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి