గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు
మేడ్చల్ మల్కాజ్గిరి /నవోదయం
సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం కట్ట మైసమ్మ లింగం చెరువు వద్ద జరగనున్న గణేష్ నిమజ్జనం ఉత్సవాల ఏర్పాట్లను మంగళవారం కుత్బుల్లాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం , కుత్బుల్లాపూర్ డివిజన్ ఏసీపీ బాల గంగిరెడ్డి పరిశీలించారు. సూరారం సీఐ తో కలిసి నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించి భద్రత ఏర్పాట్లను వారు సమీక్షించారు. గణేష్ నిమజ్జనం ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా సీఐ బాలరాజు గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరగడానికి పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. రాత్రి 9 గంటల లోపు నిమజ్జనం ఉత్సవాలు పూర్తి అయ్యేటట్లు చూడాలని కోరారు. నిమజ్జనం ఉత్సవాల సందర్భంగా గజ ఈతగాలను అందుబాటులో ఉంచుకోవాలని, ఊరేగింపు సందర్భంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం తాగి ఊరేగింపులో పాల్గొనకుండా అవగాహన కల్పించాలని, డీజే సౌండ్ లను నిషేధించినట్లు పేర్కొన్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి ఆయన ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిమజ్జనం ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేట్లు చూడాలని కోరారు. ఇందుకు పోలీసులు అన్ని రకాల సహకారాలను అందిస్తారని తెలిపారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా సురక్షితంగా జరిగేలా సూరారం పోలీసులు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Telangana
గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు
Quick Summary:
గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు
