కొత్తూరులో ఖేలో ఇండియా–అస్మితా ఉషు లీగ్ ఎంపిక పోటీలు
ఉషులో సత్తా చాటిన 150 మందికి పైగా బాలికలు
రాష్ట్ర స్థాయి పోటీలకు ఉషు క్రీడాకారిణుల ఎంపిక
కొత్తూర్/నవోదయం :
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా–అస్మితా ఉషు లీగ్ మహిళల జిల్లా స్థాయి ఎంపిక పోటీలు కొత్తూరు PM SHRI ZPHS ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో 150 మందికి పైగా బాలికలు ఉత్సాహంగా పాల్గొని వివిధ విభాగాల్లో ప్రతిభను ప్రదర్శించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
కార్యక్రమానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, షాద్‌నగర్ సీనియర్ అడ్వకేట్ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారిణులను అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. ప్రతిభ కనబరిచిన బాలికలకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో BRS, కాంగ్రెస్ నాయకులు, AWT జాయింట్ సెక్రటరీ వేముల సతీష్, రంగారెడ్డి జిల్లా వుషు స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. పి. వెంకటేశ్వర్ రెడ్డి, కార్యదర్శి జావేద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత బాలికలను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
Telangana
కొత్తూరులో ఖేలో ఇండియా–అస్మితా ఉషు లీగ్ ఎంపిక పోటీలు
Quick Summary:
కొత్తూరులో ఖేలో ఇండియా–అస్మితా ఉషు లీగ్ ఎంపిక పోటీలు

