గణేష్ నిమజ్జనం ఏర్పాలను పరిశీలించిన కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి /నవోదయం :
గణేష్ నిమజ్జనాలను పురస్కరించుకొని సూరారం లింగం చెరువు , ట్యాంక్ వద్ద చేపట్టిన ఏర్పాట్లను కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి సంబంధిత అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల భద్రత చర్యలు చేపట్టామని డీసీపీ తెలిపారు. సూరారం లింగం చెరువు పరిసరాలలో ప్రతిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్, సీఎంసీ , విద్యుత్, వైద్యం విభాగం తదితర శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని డీసీపీ వివరించారు. చెరువు కట్టపై నిరంతరం నిఘా ఉండేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాల పనితీరును ఆయన పర్యవేక్షించి... సిబ్బందికి సూచనలు చేశారు. విద్యుత్ తాగునీరు ,పారిశుద్ధ్య సేవలు, వైద్య సదుపాయాలతో పాటు నిమజ్జన వీధులలో పాల్గొనే సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు సంబంధించిన అధికారులు తెలిపారు. భక్తులందరూ పోలీస్ అధికార యంత్రాంగానికి సహకరించాలని నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని డీసీపీ సూచించారు. సూరారం సీఐ, ఎస్సైలు, ట్రాఫిక్ విభాగం, పోలీస్ అధికారులు, సిబ్బంది, సీఎంసీ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Telangana
గణేష్ నిమజ్జనం ఏర్పాలను పరిశీలించిన కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి
Quick Summary:
గణేష్ నిమజ్జనం ఏర్పాలను పరిశీలించిన కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి
