నార్త్ సిటీ హై స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం
నార్త్ సిటీ హై స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని
సూరారం లోని " నార్త్ సిటీ హై స్కూల్ " కరస్పాండెంట్ కోల వెంకటేష్ ముదిరాజ్,రమాదేవి, ఫౌండర్ కోల రవీందర్, డైరక్టర్ శ్రీకాంత్, అకడమిక్ డైరక్టర్ యోగేష్ చంద్ర ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకారిణి భారతీయం సత్యవాణి ,
మండల విద్యాధికారి శ్రీమతి జెమనీ కుమారి పాల్గొన్నారు. ప్రతియేటా లాగానే చుట్టూ ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని ఉత్తమ ఉపాధ్యాయులను నార్త్ సిటీ హై స్కూల్ యజమాన్యం శాలువాలతో ,సన్మానపత్రం, పులమాలలతో ఘనంగా సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారిలో
జీతయ్య, జోషి ప్రవీణ్ కుమార్, సంధ్య, డి చంద్రశేఖర్, కరుణ, భారతి, పి అరుణ, సురేష్ బాబు, వెంకట లక్ష్మి, సుకృతి లు ఉన్నారు.
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకారిణి భారతీయం సత్యవాణి 'ఆచార్యదేవోభవ' అర్థం తెలిపి ఉపాధ్యాయుల గురించి విద్యార్థుల్లో అవగాహనను కలగజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీమతి జెమనీ కుమారి మాట్లాడుతూ... విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉపాధ్యాయులకు విద్యాబుద్ధులు అందించడంతోపాటు వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సమాజాభివృద్ధికి ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని అన్నారు. గురువుల సేవలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల ఉన్నతికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు.ఈ కార్యక్రమనికి స్ఫూర్తినిచ్చిన రిటైర్డ్ టీచర్-ఈశ్వరయ్యని అందరూ అభినందించారు. ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలకు సహకార బంధాన్ని ఏర్పరిచి ప్రతి గురువును గౌరవించేట్లు పేరణ నిచ్చిన ఈ కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతమైంది.
Education
నార్త్ సిటీ హై స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం
Quick Summary:
నార్త్ సిటీ హై స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం