ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
విద్యార్థులతో మానవహారం – ప్రభుత్వానికి భాగ్యరధి డిగ్రీ కళాశాల డిమాండ్
మేడ్చల్ - మల్కాజ్గిరి సెప్టెంబర్ 9, (నవోదయం)
తెలంగాణ ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (TPDMA) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉద్యమంలో భాగంగా బుధవారం భాగ్యరధి డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బందితో కలిసి మానవహారం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్, ప్రిన్సిపాల్ నవీన్ రాజ్, టీచింగ్ మరియు నాన్-టీచింగ్ సిబ్బంది పాల్గొని విద్యార్థుల సమస్యలకు తమ మద్దతు తెలిపారు.
డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతో కీలకమని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఫీజులు చెల్లించలేక కొంతమంది విద్యార్థులు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. స్కాలర్‌షిప్‌లు ఆలస్యం కావడం వల్ల విద్యార్థుల కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని అన్నారు. లెక్చరర్లు మరియు కాలేజీ సిబ్బందిపై కూడా ఈ పరిస్థితి ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో కాలేజీల ఆర్థిక పరిస్థితి దెబ్బతిని, సిబ్బందికి జీతాలు, విద్యా వనరులు, నిర్వహణ ఖర్చులు వంటి అంశాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. కాలేజీలకు నిధులు సకాలంలో అందకపోతే విద్యార్థులకు అందించాల్సిన నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, డిజిటల్ విద్యా సదుపాయాలు మరియు ఇతర విద్యా కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
“విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకూడదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి, ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కాలేజీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసే విధంగా స్పష్టమైన విధానం రూపొందించాలని టీపీడీఎంఏ
(TPDMA) తరఫున ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్, ప్రిన్సిపాల్ నవీన్ రాజ్, టీచింగ్ స్టాఫ్, నాన్-టీచింగ్ స్టాఫ్ , పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
Telangana
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి విద్యార్థులతో మానవహారం – ప్రభుత్వానికి భాగ్యరధి డిగ్రీ కళాశాల డిమాండ్
Quick Summary:
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి విద్యార్థులతో మానవహారం – ప్రభుత్వానికి భాగ్యరధి డిగ్రీ కళాశాల డిమాండ్
