జడ్చర్లలో హరిత టూరిజం హోటల్ ఏర్పాటు చేయాలి
జడ్చర్ల పర్యాటకాభివృద్ధికి మరో అడుగు.. హరిత హోటల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
సర్వే నెంబర్ 445 లో 4.12 ఎకరాల్లో హరిత టూరిజం హోటల్.. జడ్చర్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కొత్త ప్రతిపాదన
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రతిపాదన
జడ్చర్ల, సెప్టెంబర్ 09: జడ్చర్ల నియోజకవర్గంలో పర్యాటక రంగ అభివృద్ధితో పాటు ప్రయాణికులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో జడ్చర్లలో హరిత టూరిజం హోటల్ ఏర్పాటు చేయాలని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి లేఖ రాస్తూ, జడ్చర్ల గ్రామం, మండలం పరిధిలోని సర్వే నంబర్ 445లో 4.12 ఎకరాల ప్రభుత్వ భూమి పర్యాటక శాఖకు కేటాయించబడిందని తెలిపారు. ఈ స్థలంలో హరిత టూరిజం హోటల్ ఏర్పాటు చేయడం ద్వారా జడ్చర్ల ప్రాంతంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
జడ్చర్ల వ్యూహాత్మకంగా అనుకూలమైన ప్రాంతంలో ఉండటంతో పాటు, ప్రయాణికులు మరియు పర్యాటకులకు నాణ్యమైన వసతి, భోజన సదుపాయాలు అందించేందుకు హరిత హోటల్ ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని తెలిపారు.
అందువల్ల ఇప్పటికే పర్యాటక శాఖకు కేటాయించిన సర్వే నంబర్ 445లోని 4.12 ఎకరాల స్థలంలో హరిత టూరిజం హోటల్ నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేసి, అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కోరారు.
జడ్చర్ల అభివృద్ధిలో పర్యాటక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాధించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు.
Telangana
జడ్చర్ల పర్యాటకాభివృద్ధికి మరో అడుగు.. హరిత హోటల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
Quick Summary:
జడ్చర్ల పర్యాటకాభివృద్ధికి మరో అడుగు.. హరిత హోటల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి