ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి
కేశంపేట/నవోదయం : ఓబీసీ కులగణన సాధన కోసం ఈ నెల 4న శంషాబాద్ గొల్లపల్లి రోడ్డులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కేశంపేట మండలం నుంచి వెయ్యి మందికి పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుమగల్ల రమేష్ పిలుపునిచ్చారు.
బీసీలకు జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం అందించాలంటే వారి జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన గణాంకాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఓబీసీల హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సభకు జనసమీకరణపై కేశంపేట మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలను తరలించే అంశంపై చర్చించారు. శాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో నిర్వహించనున్న సభకు భారీగా జనసమీకరణ చేపట్టాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఓబీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం నిర్వహిస్తున్న సభకు మండలం నుంచి వెయ్యి మందికి పైగా తరలివచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి గ్రామం నుంచి ప్రజలను సమీకరించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్ అప్పా, మాజీ మండల అధ్యక్షుడు గూడ విరేష్, మాజీ జెడ్పీటీసీ విశాల శ్రవణ్‌రెడ్డి, ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల పెంటయ్య, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాణి, కిసాన్ సెల్ అధ్యక్షుడు కోడూరు రాములు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇబ్రహీం, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రూప్లా నాయక్, పలువురు మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Telangana
ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి
Quick Summary:
ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి