పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఘన సన్మానం
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మర్యాదపూర్వక భేటీ
మేడ్చల్–మల్కాజిగిరి / నవోదయం: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం గాంధీభవన్‌లో ఆయనను కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. పార్టీ అభ్యున్నతికి ఆయన అందిస్తున్న సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, దీపక్ జాన్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఘన సన్మానం
Quick Summary:
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఘన సన్మానం
