వరంగల్‌లో ఘనంగా MRPS–MSP జాతీయ సదస్సు
ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ
వరంగల్: వరంగల్‌లోని సత్యసాయి కన్వెన్షన్ హాల్‌లో MRPS–MSP జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రద్దయిన జిల్లా, మండల కమిటీల బాధ్యులతో పాటు గతంలో ఉద్యమంలో చురుకుగా, నిజాయితీగా పనిచేసిన సీనియర్ నాయకులు, జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి MRPS వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యమ ప్రస్థానం, సంస్థాగత నిర్మాణం, నాయకత్వ ఎదుగుదల తదితర అంశాలపై ఆయన నాయకులు, కార్యకర్తలకు సందేశం ఇచ్చారు.
అనంతరం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ఈ జాతీయ సదస్సుకు హాజరయ్యారు.
సదస్సు సందర్భంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడం, సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
Telangana
వరంగల్‌లో ఘనంగా MRPS–MSP జాతీయ సదస్సు ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ
Quick Summary:
వరంగల్‌లో ఘనంగా MRPS–MSP జాతీయ సదస్సు ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ