వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్
మేడ్చల్ మల్కాజ్గిరి /నవోదయం
గణేష్ చతుర్థి సందర్భంగా మంగళవారం గాజులరామారం విలేజ్ లో గణేష్ చతుర్థి పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆ వినాయకుడి దర్శించుకున్న స్థానిక కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ని శాలువ తో సత్కరించి ఆ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ఇంద్రసేనారెడ్డి, ఇంద్రసేనా గుప్త, బాలరాజు, యాదగిరి, శ్రీరాములు, పెంటా రెడ్డి, కూన రాఘవేందర్ గౌడ్,ముత్యపాగా లక్ష్మణ్, సురేష్, నరసింహ రెడ్డి, నరేంద్ర వర్మ, యం సాగర్, కూన నరేష్ గౌడ్, సురేష్ శ్రీరాములు, లక్ష్మీనారాయణ రెడ్డి, , సుజిత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి వంశీ గౌడ్, ఋషి కుమార్, సాగర్ లతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Telangana
వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్
Quick Summary:
వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్