రఘు రాములు మనవరాలి తొట్టెల కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
తలకొండపల్లి/నవోదయం : రంగారెడ్డి జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి రఘు రాములు గారి మనవరాలి తొట్టెల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వెంకట్రావుపేట్‌లోని పద్మ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చిన్నారిని ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ చైర్మన్ సూదిని రామ్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు ఠాకూర్ బాలాజీ సింగ్, కాంగ్రెస్ పార్టీ తలకొండపల్లి మండల అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు డోకురి ప్రభాకర్ రెడ్డి, గూడూరు శ్రీనివాస్ రెడ్డి, యాట నరసింహతో పాటు పలువురు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
Telangana
రఘు రాములు మనవరాలి తొట్టెల కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
Quick Summary:
రఘు రాములు మనవరాలి తొట్టెల కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి