అంబేద్కరా...! రాజ్యాంగ పరిరక్షణలో రేవంత్ సర్కార్ కి మంచి బుద్ధిని ప్రసాదించు...
సంక్షేమ పథకాలు అమలు చేయాలి: బీఆర్‌ఎస్
అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత
మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి సెప్టెంబర్ 8 ( నవోదయం)
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 33 నెలలు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ కుత్బుల్లాపూర్ డివిజన్ అంబేద్కర్ నగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు.రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సాయం, రైతు భరోసా, కౌలు రైతులకు రైతు భరోసా, మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు విద్యా భరోసా, పెండింగ్ ఫీజు బకాయిల చెల్లింపు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ల పెంపు వంటి హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలపై బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతూ ఎదురుదాడికి దిగుతోందని విమర్శించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను స్మరిస్తూ చింతల్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ నగర్ వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.
Telangana
అంబేద్కరా...! రాజ్యాంగ పరిరక్షణలో రేవంత్ సర్కార్ కి మంచి బుద్ధిని ప్రసాదించు...
Quick Summary:
అంబేద్కరా...! రాజ్యాంగ పరిరక్షణలో రేవంత్ సర్కార్ కి మంచి బుద్ధిని ప్రసాదించు...

