అసైన్మెంట్ భూమిలో దళితులకు హక్కులు కల్పించాలి -బౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ
మేడ్చల్ మల్కాజ్గిరి/నవోదయం
బౌరంపేట గ్రామం సర్వేనెంబర్ 472 ప్రభుత్వ స్థలంలో అసైనీలుగా ఉన్న దళితులకు న్యాయం చేయాలని బుధవారం గ్రామ మాజీ సర్పంచ్, జిల్లా బిజెపి ఉపాధ్యక్షురాలు కొమ్ము మంగమ్మ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో దళితులు మల్కాజ్గిరి ఆర్డిఓ శ్యాం ప్రకాష్ ను కలిసి అభ్యర్థించారు.
ఈ సందర్భంగా వారు తమ గోడును ఆర్డీవోకు వెలిబుచ్చారు. సర్వేనెంబర్ 472లో గత 75 సంవత్సరాలుగా 100 కుటుంబాల దళితులు వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని, ప్రస్తుతం ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని వివరించారు. అదే భూమిని నమ్ముకుని బతుకుతున్న దళితులకు ప్రభుత్వం ఉదార స్వభావంతో సహాయం చేయాలని వారు అభ్యర్థించారు.దుండిగల్ గ్రామంలో ఇటీవల అసైన్మెంట్ వాసుల నుండి ప్రభుత్వం తిరిగి భూములు తీసుకుంటున్న సందర్భంలో ప్రతి ఎకరాకు సుమారు 700 గజాల అభివృద్ధి పరిచిన భూమిని అసైన్మెంట్ వాసులకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని వారు గుర్తు చేశారు. అదే పద్ధతిని బౌరంపేట అసైన్మెంట్ దారులైన దళితులకు కూడా వర్తింపచేయాలని వారు కోరారు. సర్వే నెంబర్ 472లో మొత్తం 32 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అసైన్మెంట్ దారులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ప్రభుత్వం వాపస్ తీసుకుందని వారు గుర్తు చేశారు. అదే భూమిపై వ్యవసాయం చేసుకుని ఇంతకాలం జీవనోపాధి పొందిన దళితులకు ప్రతి శిశువు ఎకరాకు 1000 గజాల చొప్పున అభివృద్ధి పరిచిన ప్రభుత్వ భూమిని అందించాలని వారు విన్నవించారు. ఈ విషయమై దుండిగల్ మండల తహసీల్దారుకు కూడా విజ్ఞాపన పత్రం అందించినట్లు దళిత నేతలు ఆర్డీవోకు తెలిపారు.
Telangana
అసైన్మెంట్ భూమిలో దళితులకు హక్కులు కల్పించాలి -బౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ
Quick Summary:
అసైన్మెంట్ భూమిలో దళితులకు హక్కులు కల్పించాలి -బౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ