దేవునిపడకల్‌లో శాలివాహన కుమ్మరి సంఘం మినీ ఫంక్షన్ హాల్‌కు భూమిపూజ
దేవునిపడకల్, సెప్టెంబర్ 16:
దేవునిపడకల్ గ్రామంలో శాలివాహన కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న మినీ ఫంక్షన్ హాల్‌కు బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ కానుగుల అనిత మల్లేష్, కుమ్మరి సంఘం అధ్యక్షులు కానుగుల బాలకిష్టయ్యలు కలిసి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించారు. సంఘం భవన నిర్మాణానికి శుభారంభం చేయడం పట్ల సంఘ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కానుగుల మాధవి మల్లేష్, మాజీ వార్డు సభ్యులు కే. రవి, టీ. బాలరాజ్, కే. కృష్ణ, కే. లక్ష్మీనారాయణ, కే. శ్రీను, కే. కుమార్, శ్రీరాములు, మల్లేష్, సత్యనారాయణ, మల్లేష్, యాదయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Telangana
దేవునిపడకల్‌లో శాలివాహన కుమ్మరి సంఘం మినీ ఫంక్షన్ హాల్‌కు భూమిపూజ
Quick Summary:
దేవునిపడకల్‌లో శాలివాహన కుమ్మరి సంఘం మినీ ఫంక్షన్ హాల్‌కు భూమిపూజ