ఎంఐఎం జిల్లా అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 10: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హదీ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత డాక్టర్ సి. లక్ష్మారెడ్డి గురువారం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మహ్మద్ అబ్దుల్ హదీ మృతికి లక్ష్మారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా అందరితో సత్సంబంధాలు కలిగి, ప్రజా జీవితంలో తనదైన సేవలందించిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. అబ్దుల్ హదీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మృతుడి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, అబ్దుల్ హదీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, రాంమోహన్, మహ్మద్ హాఫిజ్ ఉర్ రహెమాన్, నందకీశోర్ గౌడ్, దనీష్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
ఎంఐఎం జిల్లా అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Quick Summary:
ఎంఐఎం జిల్లా అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి