Sun, Oct 25, 2026
YouTube
Rivx Studios
News Thumb సామాన్యుడి కంచంలో గుదిబండ! బియ్యం ధరల భగభగ.. పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం News Thumb ప్రపంచం భారత్ వైపు చూసేలా మోదీ పాలన పరిహారం ఇవ్వకుండా పేదల ఇళ్ల కూల్చివేత దుర్మార్గం News Thumb జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి News Thumb ఫ్రీజర్‌లో మృతదేహాలు.. పర్యవేక్షణ ఏదీ? విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కుళ్లిన శవాలు.. మళ్లీ వార్తల్లోకి జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి News Thumb సాగునీటి కోసం రైతుల ఎదురుచూపులు.. ఎండుతున్న వరి పొలాలు! ఉదండాపూర్‌ ఎప్పుడు పూర్తవుతుంది? పాలమూరు ప్రాజెక్టుతోనే కరువుకు చెక్‌ News Thumb ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ సన్నద్ధం డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు పోటీలు.. 27 క్రీడాంశాల్లో ప్రతిభావంతుల ఎంపికపై ప్రత్యేక దృష్టి News Thumb ఇండియాను గెలిపించిన తెలుగు కుర్రాళ్లు..! తిలక్ వర్మ మెరుపులు.. నితీష్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్‌.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం News Thumb మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం ఫేక్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. లేకుంటే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం News Thumb కరువు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం గిరిజన ప్రాంతాల్లో 125 రోజుల ఉపాధి హామీ ఉపాధి హామీపై సీతక్క మార్క్ చర్యలు News Thumb ప్రపంచ తపాలా దినోత్సవం: ఉత్తరాల నుంచి డిజిటల్ యుగం వరకు.. ప్రజల హృదయాలను కలిపే తపాలా వ్యవస్థ News Thumb కుత్బుల్లాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు శంకుస్థాపన పేదల సొంతింటి కల సాకారం దిశగా అడుగులు: మంత్రి పొంగులేటి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఆఫ్రికా గడ్డపై వన్డే ప్రపంచకప్ సమరం! అక్టోబర్ తొలి వారంలో ఆరంభం.. నవంబర్ 21న మెగా ఫైనల్ News Thumb గువాహటిలో గర్జించిన టీమిండియా.. 405 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ కైవసం News Thumb భరతసింహి రెడ్డితో గోడవ | ఆయనుంటే పక్కా ఎమ్మెల్యే| మామూలు ఇంటర్యూ కాదు | మాజీ జెడ్పిటిసి భాగ్యలక్ష్మి News Thumb తెలంగాణ మెడికల్ విద్యార్థులకు నష్టం కలిగించేలా ప్రభుత్వ నిర్ణయాలు News Thumb బ్యానర్లపై ‘సేవకులు’... చేతల్లో మాత్రం కాలయాపన.! జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై పాలమూరు టు ప్రజాభవన్ పాదయాత్ర News Thumb అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం(Happy Daughters Day) — సెప్టెంబర్ 27 నవోదయం ప్రత్యేకం : News Thumb దుందుబి వాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం News Thumb నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పాలాది హైందవి News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సుపతం హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb షాద్‌నగర్‌లో గణేశ్ ఉత్సవ చెస్ కార్యక్రమం నిర్వహణ News Thumb ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి News Thumb డబ్బుల కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు News Thumb స్వేరో నెట్వర్క్ నారాయణపేట జిల్లా కమిటీ నిర్మాణ సన్నాహక సమావేశం : గిద్ద విజయ్ కుమార్ స్వేరో నారాయణపేట జిల్లా ఇన్చార్జి News Thumb గణేష్ నిమజ్జనం ఏర్పాలను పరిశీలించిన కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి News Thumb నియోజకవర్గ పరిధిలో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb వరంగల్ విమానాశ్రయానికి పి.వి. నరసింహారావు పేరు పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గోగులపాటి కృష్ణమోహన్ విజ్ఞప్తి News Thumb గణేష్ నిమజ్జన కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో రమణారెడ్డి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన News Thumb గణేష్ నిమజ్జనం సందర్భంగా DJ సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదు News Thumb చంద్రా గార్డెన్‌లో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ News Thumb ఛలో కొడంగల్.. పాంచ జన్య సంకల్ప సభకు తన సైన్యం తో కలిసి బయలుదేరిన కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ నేను రవి రాథోడ్ News Thumb ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం: కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి News Thumb అసైన్మెంట్ భూమిలో దళితులకు హక్కులు కల్పించాలి -బౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ News Thumb కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నాయకులు ప్రమాదంలో మృతి చెందిన రాఘవేందర్ కుటుంబానికి రూ.25,500 ఆర్థిక సాయం News Thumb ఎమ్మెల్యే సహకారంతో ఎల్లికట్టలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు News Thumb దేవునిపడకల్‌లో శాలివాహన కుమ్మరి సంఘం మినీ ఫంక్షన్‌ హాల్‌కు భూమిపూజ News Thumb గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వార్డు సభ్యులు News Thumb ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు News Thumb వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ News Thumb గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు News Thumb పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఘన సన్మానం News Thumb యువ రైతు పారేష్ యాదవ్‌ను అభినందించిన అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి News Thumb కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్‌ అందించిన విద్యా సేవకుడు వై.వి. గోపాలకృష్ణమూర్తి News Thumb ఎంఐఎం జిల్లా అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb సీఎం, మంత్రులపైనే కేసులు పెట్టాలి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb ప్రజాభద్రత–పోలీసు బాధ్యతపై కిష్టారం గ్రామంలో అవగాహన కార్యక్రమం News Thumb వరంగల్‌లో ఘనంగా MRPS–MSP జాతీయ సదస్సు ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ News Thumb రఘు రాములు మనవరాలి తొట్టెల కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి విద్యార్థులతో మానవహారం – ప్రభుత్వానికి భాగ్యరధి డిగ్రీ కళాశాల డిమాండ్ News Thumb గణేష్ మండప నిర్వాహకులతో అవగాహన సన్నాహాక సమావేశం News Thumb నార్త్ సిటీ హై స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం News Thumb సెక్యూరిటీ కార్మికులకి రావలసిన వేత్తనం ఇప్పించిన బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి News Thumb బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb జడ్చర్ల పర్యాటకాభివృద్ధికి మరో అడుగు.. హరిత హోటల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి News Thumb "మీడియా రంగంలో బీసీ / ఎస్సీ / ఎస్టీ కుల ప్రాతినిద్యము ఉండాల్సిందే ..!! News Thumb తాతా మధు దిష్టిబొమ్మ దహనం స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి: కాంగ్రెస్ నాయకుల డిమాండ్ News Thumb తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్(TPDMA ) పిలుపుకు మద్దతుగా చింతల్ భాగ్యరథి డిగ్రీ కళాశాల బంద్ News Thumb అంబేద్కరా...! రాజ్యాంగ పరిరక్షణలో రేవంత్ సర్కార్ కి మంచి బుద్ధిని ప్రసాదించు... News Thumb గిగ్ కార్మికులకు కార్మిక హోదా కల్పించి సామాజిక భద్రత కల్పించాలి News Thumb కొత్తూరులో ఖేలో ఇండియా–అస్మితా ఉషు లీగ్ ఎంపిక పోటీలు News Thumb హైదరాబాద్ అభివృద్ధిలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సేవలు News Thumb కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి : ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ News Thumb కల్వకుర్తి పట్టణంలో బిజెపి BJYM నాయకుల అక్రమ అరెస్ట్ News Thumb వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ News Thumb రైతు సమస్యలపై బీఆర్ఎస్‌ రైతు గర్జన కాంగ్రెస్‌ పాలనలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు — మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb సామాన్యుడి కంచంలో గుదిబండ! బియ్యం ధరల భగభగ.. పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం News Thumb ప్రపంచం భారత్ వైపు చూసేలా మోదీ పాలన పరిహారం ఇవ్వకుండా పేదల ఇళ్ల కూల్చివేత దుర్మార్గం News Thumb జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి News Thumb ఫ్రీజర్‌లో మృతదేహాలు.. పర్యవేక్షణ ఏదీ? విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కుళ్లిన శవాలు.. మళ్లీ వార్తల్లోకి జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి News Thumb సాగునీటి కోసం రైతుల ఎదురుచూపులు.. ఎండుతున్న వరి పొలాలు! ఉదండాపూర్‌ ఎప్పుడు పూర్తవుతుంది? పాలమూరు ప్రాజెక్టుతోనే కరువుకు చెక్‌ News Thumb ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ సన్నద్ధం డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు పోటీలు.. 27 క్రీడాంశాల్లో ప్రతిభావంతుల ఎంపికపై ప్రత్యేక దృష్టి News Thumb ఇండియాను గెలిపించిన తెలుగు కుర్రాళ్లు..! తిలక్ వర్మ మెరుపులు.. నితీష్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్‌.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం News Thumb మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం ఫేక్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. లేకుంటే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం News Thumb కరువు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం గిరిజన ప్రాంతాల్లో 125 రోజుల ఉపాధి హామీ ఉపాధి హామీపై సీతక్క మార్క్ చర్యలు News Thumb ప్రపంచ తపాలా దినోత్సవం: ఉత్తరాల నుంచి డిజిటల్ యుగం వరకు.. ప్రజల హృదయాలను కలిపే తపాలా వ్యవస్థ News Thumb కుత్బుల్లాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు శంకుస్థాపన పేదల సొంతింటి కల సాకారం దిశగా అడుగులు: మంత్రి పొంగులేటి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఆఫ్రికా గడ్డపై వన్డే ప్రపంచకప్ సమరం! అక్టోబర్ తొలి వారంలో ఆరంభం.. నవంబర్ 21న మెగా ఫైనల్ News Thumb గువాహటిలో గర్జించిన టీమిండియా.. 405 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ కైవసం News Thumb భరతసింహి రెడ్డితో గోడవ | ఆయనుంటే పక్కా ఎమ్మెల్యే| మామూలు ఇంటర్యూ కాదు | మాజీ జెడ్పిటిసి భాగ్యలక్ష్మి News Thumb తెలంగాణ మెడికల్ విద్యార్థులకు నష్టం కలిగించేలా ప్రభుత్వ నిర్ణయాలు News Thumb బ్యానర్లపై ‘సేవకులు’... చేతల్లో మాత్రం కాలయాపన.! జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై పాలమూరు టు ప్రజాభవన్ పాదయాత్ర News Thumb అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం(Happy Daughters Day) — సెప్టెంబర్ 27 నవోదయం ప్రత్యేకం : News Thumb దుందుబి వాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం News Thumb నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పాలాది హైందవి News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సుపతం హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb షాద్‌నగర్‌లో గణేశ్ ఉత్సవ చెస్ కార్యక్రమం నిర్వహణ News Thumb ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి News Thumb డబ్బుల కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు News Thumb స్వేరో నెట్వర్క్ నారాయణపేట జిల్లా కమిటీ నిర్మాణ సన్నాహక సమావేశం : గిద్ద విజయ్ కుమార్ స్వేరో నారాయణపేట జిల్లా ఇన్చార్జి News Thumb గణేష్ నిమజ్జనం ఏర్పాలను పరిశీలించిన కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి News Thumb నియోజకవర్గ పరిధిలో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb వరంగల్ విమానాశ్రయానికి పి.వి. నరసింహారావు పేరు పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గోగులపాటి కృష్ణమోహన్ విజ్ఞప్తి News Thumb గణేష్ నిమజ్జన కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో రమణారెడ్డి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన News Thumb గణేష్ నిమజ్జనం సందర్భంగా DJ సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదు News Thumb చంద్రా గార్డెన్‌లో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ News Thumb ఛలో కొడంగల్.. పాంచ జన్య సంకల్ప సభకు తన సైన్యం తో కలిసి బయలుదేరిన కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ నేను రవి రాథోడ్ News Thumb ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం: కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి News Thumb అసైన్మెంట్ భూమిలో దళితులకు హక్కులు కల్పించాలి -బౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ News Thumb కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నాయకులు ప్రమాదంలో మృతి చెందిన రాఘవేందర్ కుటుంబానికి రూ.25,500 ఆర్థిక సాయం News Thumb ఎమ్మెల్యే సహకారంతో ఎల్లికట్టలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు News Thumb దేవునిపడకల్‌లో శాలివాహన కుమ్మరి సంఘం మినీ ఫంక్షన్‌ హాల్‌కు భూమిపూజ News Thumb గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వార్డు సభ్యులు News Thumb ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు News Thumb వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ News Thumb గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు News Thumb పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఘన సన్మానం News Thumb యువ రైతు పారేష్ యాదవ్‌ను అభినందించిన అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి News Thumb కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్‌ అందించిన విద్యా సేవకుడు వై.వి. గోపాలకృష్ణమూర్తి News Thumb ఎంఐఎం జిల్లా అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb సీఎం, మంత్రులపైనే కేసులు పెట్టాలి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb ప్రజాభద్రత–పోలీసు బాధ్యతపై కిష్టారం గ్రామంలో అవగాహన కార్యక్రమం News Thumb వరంగల్‌లో ఘనంగా MRPS–MSP జాతీయ సదస్సు ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ News Thumb రఘు రాములు మనవరాలి తొట్టెల కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి విద్యార్థులతో మానవహారం – ప్రభుత్వానికి భాగ్యరధి డిగ్రీ కళాశాల డిమాండ్ News Thumb గణేష్ మండప నిర్వాహకులతో అవగాహన సన్నాహాక సమావేశం News Thumb నార్త్ సిటీ హై స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం News Thumb సెక్యూరిటీ కార్మికులకి రావలసిన వేత్తనం ఇప్పించిన బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి News Thumb బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb జడ్చర్ల పర్యాటకాభివృద్ధికి మరో అడుగు.. హరిత హోటల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి News Thumb "మీడియా రంగంలో బీసీ / ఎస్సీ / ఎస్టీ కుల ప్రాతినిద్యము ఉండాల్సిందే ..!! News Thumb తాతా మధు దిష్టిబొమ్మ దహనం స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి: కాంగ్రెస్ నాయకుల డిమాండ్ News Thumb తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్(TPDMA ) పిలుపుకు మద్దతుగా చింతల్ భాగ్యరథి డిగ్రీ కళాశాల బంద్ News Thumb అంబేద్కరా...! రాజ్యాంగ పరిరక్షణలో రేవంత్ సర్కార్ కి మంచి బుద్ధిని ప్రసాదించు... News Thumb గిగ్ కార్మికులకు కార్మిక హోదా కల్పించి సామాజిక భద్రత కల్పించాలి News Thumb కొత్తూరులో ఖేలో ఇండియా–అస్మితా ఉషు లీగ్ ఎంపిక పోటీలు News Thumb హైదరాబాద్ అభివృద్ధిలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సేవలు News Thumb కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి : ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ News Thumb కల్వకుర్తి పట్టణంలో బిజెపి BJYM నాయకుల అక్రమ అరెస్ట్ News Thumb వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ News Thumb రైతు సమస్యలపై బీఆర్ఎస్‌ రైతు గర్జన కాంగ్రెస్‌ పాలనలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు — మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
సామాన్యుడి కంచంలో గుదిబండ! బియ్యం ధరల భగభగ.. పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం ప్రపంచం భారత్ వైపు చూసేలా మోదీ పాలన పరిహారం ఇవ్వకుండా పేదల ఇళ్ల కూల్చివేత దుర్మార్గం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఫ్రీజర్‌లో మృతదేహాలు.. పర్యవేక్షణ ఏదీ? విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కుళ్లిన శవాలు.. మళ్లీ వార్తల్లోకి జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి సాగునీటి కోసం రైతుల ఎదురుచూపులు.. ఎండుతున్న వరి పొలాలు! ఉదండాపూర్‌ ఎప్పుడు పూర్తవుతుంది? పాలమూరు ప్రాజెక్టుతోనే కరువుకు చెక్‌
సామాన్యుడి కంచంలో గుదిబండ! బియ్యం ధరల భగభగ.. పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం - Rivx Studios
Telangana

సామాన్యుడి కంచంలో గుదిబండ! బియ్యం ధరల భగభగ.. పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం

Published on October 25, 2026 at 1:57 PM

3,075 Views

Quick Summary:

సామాన్యుడి కంచంలో గుదిబండ! బియ్యం ధరల భగభగ.. పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం

సామాన్యుడి కంచంలో గుదిబండ!

బియ్యం ధరల భగభగ.. పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం


నిల్వలు ఉన్నా తగ్గని ధరలు.. మార్కెట్‌పై ఎవరి పెత్తనం?

పండగల వేళ ధరల మంట.. ప్రభుత్వాల నియంత్రణ చర్యలేవీ?

అక్రమ నిల్వలకు అడ్డుకట్ట ఎప్పుడు? సామాన్యుడికి ఉపశమనం ఎప్పుడు?

నవోదయం డెస్క్:

ఒకప్పుడు పేదవాడి ఇంట్లో పప్పు, కూర లేకపోయినా కడుపు నింపిన అన్నం.. ఇప్పుడు అదే సామాన్యుడి కుటుంబ బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలకు బియ్యం ధరల పెరుగుదల మరో భారంగా మారుతోంది. ముఖ్యంగా అన్నమే ప్రధాన ఆహారంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు పెరగడం సామాన్య కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతోంది. గతంలో అందుబాటులో ఉన్న ధరలకు బియ్యం కొనుగోలు చేసిన కుటుంబాలు.. ఇప్పుడు అదే పరిమాణంలో బియ్యం కొనాలంటే అదనంగా వందల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

సాధారణ బియ్యం నుంచి సన్న బియ్యం వరకు ధరల పెరుగుదల వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని మార్కెట్లలో 25 కిలోల బియ్యం బ్యాగ్ ధర రూ.1,600 నుంచి రూ.2,100 వరకు పలుకుతోందన్న సమాచారం వినియోగదారులపై ధరల భారం ఎంతగా ఉందో తెలియజేస్తోంది. అయితే ఈ ధరలు బియ్యం రకం, నాణ్యత, బ్రాండ్, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. గతంలో సుమారు రూ.1,300కు లభించిన బియ్యం బ్యాగ్ ధర రూ.2,000 దాటితే.. నెలవారీ ఆదాయంలో గణనీయమైన భాగం ఆహారం కోసమే ఖర్చు చేయాల్సి వస్తుంది.

ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ప్రయాణ వ్యయాలు ఇప్పటికే పెరిగిన నేపథ్యంలో బియ్యం ధరల పెరుగుదల పేద, మధ్యతరగతి కుటుంబాలకు మరింత భారంగా మారుతోంది. ప్రశ్న ఒక్కటే.. ప్రజల కనీస ఆహార అవసరమైన బియ్యం సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?

నిల్వలు ఉన్నాయంటే ధరలు తగ్గినట్టేనా?

దేశంలో బియ్యం ఉత్పత్తి, ప్రభుత్వ గోదాముల్లో నిల్వలు, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సరుకు.. ఇవన్నీ ధరలను ప్రభావితం చేసే కీలక అంశాలు. కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వద్ద ఉన్న ధాన్యం, బియ్యం నిల్వల వివరాలను పరిశీలించడం ద్వారా దేశీయ అవసరాలకు సరిపడా సరుకు ఉందా లేదా అన్నది అంచనా వేయవచ్చు.

అయితే ప్రభుత్వ గోదాముల్లో నిల్వలు ఉండటం ఒక్కటే బహిరంగ మార్కెట్‌లో ధరలు తగ్గడానికి హామీ ఇవ్వదు. నిల్వల పరిమాణం, పంపిణీ విధానం, రవాణా ఖర్చులు, మిల్లింగ్ వ్యయాలు, మార్కెట్‌కు సరుకు చేరే వేగం, వ్యాపారుల నిల్వ విధానం వంటి అనేక అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయి.

దేశంలో బియ్యం కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వదంతులను నమ్మి అవసరానికి మించి కొనుగోళ్లు చేయకుండా జాగ్రత్త పడాలి. అదే సమయంలో దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ మార్కెట్‌లో ధరలు ఎందుకు పెరుగుతున్నాయన్న అంశంపై ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలి.

ఉత్పత్తి సమృద్ధిగా ఉన్నా వినియోగదారుడికి బియ్యం తక్కువ ధరకు అందకపోతే.. సరఫరా వ్యవస్థలో ఎక్కడ సమస్య ఉందో గుర్తించాల్సిన అవసరం ఉంది.

రైతు నుంచి వినియోగదారుడి వరకు.. మధ్యలో పెరుగుతున్న ధరలెందుకు?

వరి సాగు నుంచి వినియోగదారుడి వంటగది వరకు బియ్యం చేరే ప్రయాణంలో అనేక దశలు ఉంటాయి. రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం, రవాణా, మిల్లింగ్, నిల్వ, ప్యాకింగ్, హోల్‌సేల్ వ్యాపారం, రిటైల్ విక్రయాలు.. ప్రతి దశలోనూ కొంత వ్యయం ఉంటుంది.

అయితే ఈ ఖర్చులు ఎంత మేరకు పెరిగాయి? రైతుకు లభిస్తున్న ధరకు, వినియోగదారుడు చెల్లిస్తున్న ధరకు మధ్య అంతరం ఎంత ఉంది? మిల్లింగ్, రవాణా, ప్యాకింగ్ ఖర్చులు పెరిగినప్పటికీ వాటి ప్రభావం ఎంత? వ్యాపార లాభాలు ఎంత మేరకు ఉన్నాయి? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రావాల్సి ఉంది.

ఉదాహరణకు, ధాన్యం కొనుగోలు ధరతో పాటు మిల్లింగ్ ఖర్చులు, బియ్యం దిగుబడి నిష్పత్తి, నూకలు తదితర ఉప ఉత్పత్తుల విలువ, రవాణా, నిల్వ, పన్నులు, వ్యాపార మార్జిన్లను పరిగణనలోకి తీసుకోకుండా రైతు ధరను బియ్యం విక్రయ ధరతో నేరుగా పోల్చడం సరైన అంచనా కాదు. అందువల్ల వాస్తవ వ్యయాల ఆధారంగా ధరల పెరుగుదలపై సమగ్ర పరిశీలన అవసరం.

అదే సమయంలో కొందరు వ్యాపారులు ఉద్దేశపూర్వకంగా సరుకును నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉంటే వాటిపై అధికారులు విచారణ జరపాలి. అక్రమ నిల్వలు, కుమ్మక్కు వ్యాపారాలు, కృత్రిమ ధరల పెంపు ఉన్నట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.

పండగల సీజన్‌లోనే ధరల మంట!

దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండగల సమయంలో కుటుంబాల ఖర్చులు సహజంగానే పెరుగుతాయి. కొత్త బట్టలు, ప్రయాణాలు, పండగ వంటకాలు, ఇతర కొనుగోళ్లతో ఇంటి బడ్జెట్‌పై ఒత్తిడి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో బియ్యం ధరలు కూడా పెరిగితే పేద కుటుంబాలకు పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది.

వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలు పెంచుతున్నారా? మార్కెట్‌లో సరుకు లభ్యత తగ్గిందా? లేక రవాణా, ఉత్పత్తి వ్యయాలు పెరగడం ధరల పెరుగుదలకు కారణమా? అనే అంశాలను అధికారులు పరిశీలించాలి.

ప్రత్యేకించి టోకు గోదాములు, రైస్ మిల్లులు, ప్రధాన మార్కెట్లలో నిల్వల వివరాలు సేకరించి, రోజువారీ ధరల మార్పులను నమోదు చేయాలి. అనుమానాస్పదంగా అధిక నిల్వలు ఉన్న ప్రాంతాలను గుర్తించి తనిఖీలు నిర్వహించాలి.

పండగల పేరుతో ధరలు పెంచడం, ప్రజల్లో కొరత భయాన్ని సృష్టించడం, అవసరమైన సరుకును అక్రమంగా నిల్వచేయడం వంటి చర్యలకు పాల్పడితే వాటిని అరికట్టాలి. అయితే ధరలు పెరిగిన ప్రతిచోటా కృత్రిమ కొరతే కారణమని నిర్ధారించకుండా, వాస్తవ పరిస్థితుల ఆధారంగా చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.

బియ్యం ధరల పెరుగుదల.. కుటుంబ బడ్జెట్‌పై ఎంత భారం?

ఒక కుటుంబం నెలకు 25 కిలోల బియ్యం కొనుగోలు చేస్తుందని భావిద్దాం. గతంలో ఒక బ్యాగ్ ధర రూ.1,300 ఉండి, ప్రస్తుతం రూ.2,000కు చేరితే నెలకు రూ.700 అదనపు ఖర్చు అవుతుంది.

- నెలకు అదనపు భారం: రూ.700
- మూడు నెలలకు అదనపు భారం: రూ.2,100
- సంవత్సరానికి అదనపు భారం: రూ.8,400

ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. వాస్తవ ధరలు, కుటుంబ వినియోగం, బియ్యం రకం ఆధారంగా ఖర్చులు మారుతాయి.

ప్రభుత్వ గోదాముల నుంచి మార్కెట్ వరకు.. చర్యలు ఎక్కడ?

బియ్యం ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం నిల్వలు, సరఫరా, ఎగుమతి విధానాలు, మార్కెట్ జోక్యం వంటి అంశాలను పరిశీలించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక మార్కెట్లలో ధరల పరిస్థితి, అక్రమ నిల్వలు, వినియోగదారుల ఫిర్యాదులు, పంపిణీ వ్యవస్థపై దృష్టి సారించాలి.

అవసరాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ విక్రయ పథకం (ఓఎంఎస్ఎస్) ద్వారా బియ్యాన్ని విడుదల చేయడం, రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరాను సులభతరం చేయడం వంటి చర్యలను పరిశీలించవచ్చు. అయితే నిల్వల పరిమాణం, మార్కెట్ పరిస్థితులు, పథకం నిబంధనలను బట్టి ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు రైస్ మిల్లులు, టోకు వ్యాపార సంస్థలు, గోదాములపై తనిఖీలు నిర్వహించాలి. నిల్వల రికార్డులు, కొనుగోలు బిల్లులు, విక్రయ ధరలు, సరుకు రాకపోకలను పరిశీలించాలి. అక్రమాలు గుర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.

అలాగే బియ్యం ధరలపై ప్రజలకు అందుబాటులో ఉండేలా రోజువారీ లేదా వారంవారీ ధరల సమాచారాన్ని విడుదల చేయడం, వినియోగదారుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయడం, రేషన్ దుకాణాల్లో సరఫరా సక్రమంగా జరిగేలా పర్యవేక్షించడం అవసరం.

ప్రభుత్వం వద్ద నిల్వలు ఉన్నాయా లేదా అన్నదానికంటే.. ఆ నిల్వలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయన్నదే అసలు ప్రశ్న.

రేషన్ బియ్యం ఒక్కటే పరిష్కారమా?

ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం పేద కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ, అనేక కుటుంబాలు తమ అవసరాలు, ఆహారపు అలవాట్లను బట్టి బహిరంగ మార్కెట్‌లోనూ బియ్యం కొనుగోలు చేస్తాయి. ముఖ్యంగా సన్న బియ్యం వినియోగించే కుటుంబాలకు మార్కెట్ ధరల పెరుగుదల నేరుగా ప్రభావం చూపుతుంది.

అందువల్ల రేషన్ సరఫరాను సమర్థంగా కొనసాగించడంతో పాటు, బహిరంగ మార్కెట్‌లోనూ ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అవసరమైన చోట చౌక ధరల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడం, స్థానికంగా సరుకు అందుబాటును పెంచడం, ధరల వివరాలను ప్రజలకు తెలియజేయడం వంటి చర్యలు ప్రయోజనకరంగా ఉంటాయి.

ప్రజలకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరకు అందడం ప్రభుత్వ ఆహార భద్రతా విధానంలో కీలక అంశంగా ఉండాలి.

ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు!

బియ్యం ధరల పెరుగుదలతో ఆందోళన చెందుతున్న వినియోగదారులకు ప్రభుత్వాలు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.

1. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బియ్యం, ధాన్యం నిల్వలు ఎంత?
2. గత కొన్ని వారాల్లో బియ్యం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలేమిటి?
3. రైతుకు లభిస్తున్న ధరకు, వినియోగదారుడు చెల్లిస్తున్న ధరకు మధ్య వ్యత్యాసాన్ని అధికారులు పరిశీలించారా?
4. బియ్యం అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
5. ధరలు నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి తక్షణ చర్యలు చేపట్టనున్నాయి?
6. అవసరమైతే ఓఎంఎస్ఎస్ ద్వారా బియ్యం విడుదల చేసి మార్కెట్ ధరలను తగ్గించే అవకాశాలను పరిశీలిస్తారా?
7. పేద, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరకు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ఉందా?

ఈ ప్రశ్నలకు గణాంకాలు, తనిఖీల వివరాలు, స్పష్టమైన కార్యాచరణతో ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి.
Verified Staff Journalist admin admin@rivxstudios.com