కరువు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం
గిరిజన ప్రాంతాల్లో 125 రోజుల ఉపాధి హామీ
ఉపాధి హామీపై సీతక్క మార్క్ చర్యలు
హైదరాబాద్/నవోదయం : రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం మరియు కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో నీటి లభ్యత, రైతులకు సహాయం మరియు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్యా దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు.
* ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో జాబ్ కార్డులు లేని కుటుంబాలకు వెంటనే కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.
* కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి పేరును జాబ్ కార్డులో నమోదు చేయాలని ఆదేశించారు.
* VB-G RAM G పథకం కింద అర్హులైన గిరిజన కుటుంబాలకు 125 రోజుల ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
* కరువు సమయంలో గిరిజన కుటుంబాలకు స్థానికంగానే ఉపాధి చూపించి, వలసలను నివారించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.
* ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ ఆదేశాలు ఇచ్చారు.
* రాష్ట్రంలో ఎల్నినో, కరువు పరిస్థితులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.
* మంత్రి సీతక్క సూచనల మేరకు పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్యా దేవరాజన్ కీలక ఉత్తర్వులు జారీ.
* ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో జాబ్ కార్డులు లేని వారికి వెంటనే కొత్త కార్డుల అందజేత.
* 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి పేరు జాబ్ కార్డులో నమోదు.
* VB-G RAM G పథకం కింద 125 రోజుల ఉపాధి కల్పన ద్వారా వలసల నివారణే లక్ష్యం.
Telangana
కరువు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం గిరిజన ప్రాంతాల్లో 125 రోజుల ఉపాధి హామీ ఉపాధి హామీపై సీతక్క మార్క్ చర్యలు
Quick Summary:
కరువు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం గిరిజన ప్రాంతాల్లో 125 రోజుల ఉపాధి హామీ ఉపాధి హామీపై సీతక్క మార్క్ చర్యలు