గణేష్ మండప నిర్వాహకులతో అవగాహన సన్నాహాక సమావేశం
మేడ్చల్ మల్కాజ్గిరి సెప్టెంబర్ 9 (నవోదయం) :
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండప నిర్వాహకులు, కాలనీవాసులతో బుధవారం నాడు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో అవగాహన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ డివిజన్ ఏసీపీ బాల గంగి రెడ్డి మాట్లాడుతూ... చతుర్థి పండుగను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఎలాంటి గొడవలు, ఆటంకాలు లేకుండా జరుపుకోవాలని, రాత్రి సమయంలో మండపం నిర్వాహకులు మండపం వద్దనే పండుకోవాలని, అధిక శబ్దం వచ్చే సౌండ్ సిస్టమ్స్ మరియు వాయిద్యాలను వినియోగించవద్దని, సాధ్యమైనంత వరకు సంప్రదాయ బ్యాండ్ మరియు సంప్రదాయ వాయిద్యాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. పండుగ సందర్భంగా మద్యం సేవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి అసాంఘిక లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు.
నిమజ్జనం సమయంలో పెద్ద పెద్ద వెహికల్స్ , కంటైనర్స్ పెట్టరాదని సూచించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమతి కొరకు అప్లికేషన్ ఆన్లైన్ లో సబ్మిట్ చేసి సమాచారం లోకల్ పోలీస్ వారికి ఇవ్వాలని, వివాదాలు ఉన్న మరియు ప్రజలకు ఇబ్బంది కలిగించే స్థలాలలో ఎలాంటి విగ్రహాలు పెట్టరాదని, బలవంతపు చందాలు వసూలు చేయరాదని, నిమజ్జన సమయంలో చెరువుల దగ్గర లెగ్స్ దగ్గర నదుల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిమజ్జనం చేయాలని కోరారు.
వినాయక చవితి పండుగను శాంతియుతంగా, సురక్షితంగా మరియు సజావుగా నిర్వహించేందుకు నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో జీడిమెట్ల ఎస్ హెచ్ ఓ
కె. రవి కుమార్ , సెక్టార్ ఎస్సైలు శ్రీ ప్రేమ్ సాగర్, శ్రీనివాస్, శ్యామ్ బాబు, రామచంద్రయ్య మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Telangana
గణేష్ మండప నిర్వాహకులతో అవగాహన సన్నాహాక సమావేశం
Quick Summary:
గణేష్ మండప నిర్వాహకులతో అవగాహన సన్నాహాక సమావేశం
