ఎమ్మెల్యే సహకారంతో ఎల్లికట్టలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు
ఎల్లికట్ట, సెప్టెంబర్ 16:
పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్లికట్ట గ్రామంలో రెండో విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణానికి బుధవారం శ్రీకారం చుట్టారు.
ఎమ్మెల్యే శ్రీ కశిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో గ్రామానికి చెందిన పూడూరి అలివెల, పూడూరి నిలమ్మలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో లబ్ధిదారుల ఇళ్ల స్థలాల్లో ముగ్గులు వేసి నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు, నాయకులు లబ్ధిదారులను అభినందించారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు. మంజూరైన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
ఇల్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుమిత్ర, ఉపసర్పంచ్ కేశవులు, పంచాయతీ కార్యదర్శి గంగా, మాజీ సర్పంచ్ రాకేష్ కుమార్, నాయకులు భూపాల్ రెడ్డి, మట్ట నాగయ్య, లింగమయ్య, రమేష్, గణేష్, మన్యం తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభం కావడంతో స్థానికులు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
Telangana
ఎమ్మెల్యే సహకారంతో ఎల్లికట్టలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు
Quick Summary:
ఎమ్మెల్యే సహకారంతో ఎల్లికట్టలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు