కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నాయకులు
ప్రమాదంలో మృతి చెందిన రాఘవేందర్ కుటుంబానికి రూ.25,500 ఆర్థిక సాయం
వేల్జాల్, సెప్టెంబర్ 16:
తలకొండపల్లి మండలం వేల్జాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ కార్యకర్త కూరాకుల (ఎరుకలి) ఆంజనేయులు (అంజి) తమ్ముడు కూరాకుల రాఘవేందర్ ఇటీవల వినాయక మండపం పనులు చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు.
రాఘవేందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆపదలో ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ మొత్తం రూ.25,500 ఆర్థిక సహాయం అందజేశారు.
ఆర్థిక సహాయం అందించిన వారిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు శ్రీనివాస్ రెడ్డి రూ.4,000, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి రూ.4,000, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకట్ రెడ్డి రూ.2,000, మాజీ ఎంపీటీసీ జి. శ్రీనివాసమూర్తి రూ.1,000, మాజీ ఎంపీటీసీ ఎం. అంబాజీ రూ.2,000, మాజీ ఉపసర్పంచ్ అజీజ్ రూ.3,000, పి. అశోక్ బాబు రూ.1,000, మాజీ ఉపసర్పంచ్ బి. నర్సింలు రూ.1,000, ఏ. అంజయ్య గౌడ్ రూ.1,000, మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎం.డి. ఆరిఫ్ రూ.1,000, వద్దే రాజు రూ.1,000, ఏ. వెంకట్ రెడ్డి రూ.1,000, తిరుమణి కృష్ణయ్య గౌడ్ రూ.1,000, పుల్జాల విష్ణు రూ.1,000, వద్దే రాము రూ.1,000, దుబ్బ నరేష్ రూ.500 ఉన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కార్యకర్తలు, వారి కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజల కష్టాల్లో భాగస్వాములుగా ఉంటూ బాధిత కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎం. అంబాజీ, మాజీ ఉపసర్పంచ్ అజీజ్, మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎం.డి. ఆరిఫ్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ టీ. కృష్ణయ్య గౌడ్, నాయకులు ఎం.డి. యూసుఫ్, వద్దే రాజు, పుల్జాల విష్ణు, దుబ్బ నరేష్, సయీద్, వద్దే రామ్, చీపురి దర్శన్, గోపాల్, వట్టల మల్లేష్, మిడత రమేష్, చింతకాయల శివతో పాటు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నాయకులు ప్రమాదంలో మృతి చెందిన రాఘవేందర్ కుటుంబానికి రూ.25,500 ఆర్థిక సాయం
Quick Summary:
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నాయకులు ప్రమాదంలో మృతి చెందిన రాఘవేందర్ కుటుంబానికి రూ.25,500 ఆర్థిక సాయం