తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్(TPDMA ) పిలుపుకు మద్దతుగా చింతల్ భాగ్యరథి డిగ్రీ కళాశాల బంద్.
మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి సెప్టెంబర్ 8(నవోదయం)
తెలంగాణలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు గత నాలుగు విద్యా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ (RTF) బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ
తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్(TPDMA ) చేపట్టిన ఒకరోజు డిగ్రీ కళాశాలల బంద్‌కు చింతల్‌లోని భాగ్యరథి డిగ్రీ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ నవీన్ రాజ్ మరియు డైరెక్టర్ శ్రీ నల్ల జై శంకర్ గౌడ్ బంద్ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశారు. డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్ మాట్లాడుతూ, గత నాలుగు విద్యా సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. కళాశాలల నిర్వహణ, అధ్యాపకులు మరియు సిబ్బంది జీతాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం వంటి అంశాలపై ఈ ఆలస్యం తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. “విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలి. గత నాలుగు విద్యా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. ఇకపై రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో విడుదల చేసేలా శాశ్వత పరిష్కారం చూపాలి” అని నల్ల జై శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు.ప్రిన్సిపాల్ నవీన్ రాజ్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల కళాశాలలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, ప్రభుత్వం ఇకనైనా ఆలస్యం చేయకుండా బకాయిలను విడుదల చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్
(TPDMA) ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
Telangana
తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్(TPDMA ) పిలుపుకు మద్దతుగా చింతల్ భాగ్యరథి డిగ్రీ కళాశాల బంద్
Quick Summary:
తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్(TPDMA ) పిలుపుకు మద్దతుగా చింతల్ భాగ్యరథి డిగ్రీ కళాశాల బంద్
